గంజాయి కేసులో నిందితుడు అరెస్ట్
Mbmtelugunews//హుజూర్ నగర్,నవంబర్ 3 (ప్రతినిధి చింతారెడ్డి గోపిరెడ్డి):మేళ్లచెరువు మండల కేంద్రంలో
నిషేధిత గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని ట్యాంకర్ డ్రైవర్ పై కేసు నమోద చేసినట్టు స్థానిక ఎస్సై పరమేష్ తో కలిసి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.టీ ఎస్ 29టీసి 0549నంబర్ గల ట్యాంకర్ లారీలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై పరమేష్ తన సిబ్బంది తో గస్తీకాస్తూ మేళ్ల చెరువు నుండి హుజూర్ నగర్ వెళ్లే రోడ్డు లారీ ని పట్టుకొని డ్రైవర్ ని విచారించి పలు వివరాలను తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. లారీ డ్రైవర్ పేరు సింహాద్రి నాగరాజు తండ్రి వెంకటేశ్వరరావు(41),అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ, విజయవాడ ఆంధ్ర ప్రదేశ్. ఒరిస్సా రాష్ట్రంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి మేళ్లచెరువు గ్రామంలో తన మిత్రులకు తాగటానికి తీసుకొని వస్తున్న గా మేళ్లచెరువులో హుజూర్ నగర్ రోడ్డు దగ్గర పట్టుకొని చెక్ చేయగా లారీ సీట్ కింద 250 గ్రాములు గంజాయి పెట్టుకొని వస్తుండగా పట్టుకున్నారు.సుమారు దీని విలువ వేయి రూపాయలు గాఉంటుందని తెలిపారు.
ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించినమేళ్లచెరువు పోలీసులను డీఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమం లో డీఎస్పీ తో పాటు మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి,ఎస్సై పరమేష్,పోలీసు సిబ్బంది ఉన్నారు.