గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిపై కేసు నమోదు
Mbmtelugunews//హుజూర్ నగర్,ఏప్రిల్ 26 (ప్రతినిధి చింతారెడ్డి గోపిరెడ్డి):మేళ్లచెరువు మండల కేంద్రంలో గంజాయి మొక్కల ను పెంచుతున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది.మేళ్లచెరువు సీఐ రజితా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో గల కళ్లెం సుభాని తండ్రి లాలయ్య ఇంటి వెనక భాగంలో గంజాయి మొక్కలు పెంచుతున్నారని పక్కా సమాచారం

మేరకు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి గంజాయి మొక్కలు పెంచుతున్న సుభానిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించామని తెలిపారు.ఆపరేషన్ నిర్వహించిన ఎస్సై పరమేష్ సిబ్బందిని అభినందించారు.