కోదాడ,ఆగష్టు 15(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం గ్రామానికి చెందిన ముసుగు వీరస్వామి అన్నపూర్ణ దంపతులు వారి తల్లి ముసుకు సైదమ్మ జ్ఞాపకార్థం పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా పలువురు ముసుకు వీరస్వామి దంపతులను అభినందించడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మా అమ్మ జ్ఞాపకార్థం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని పారిశుద్ధ్య కార్మికులు ఉదయం లేచిన నాటి నుండి గ్రామంలో చెత్త లేకుండా చేయడంలో వారి పాత్ర ఎంతో కీలకమని వారు అన్నారు. గ్రామాలలో ప్రజలు అనారోగ్యాలకు గురి కాకుండా ఉంటున్నారంటే దానికి కారణం పారిశుద్ధ్య కార్మికులని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ,సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శి,స్కూల్ హెడ్మాస్టర్,మాజీ సర్పంచ్,గ్రామ పెద్దలు యువకులు,విద్యార్థులు తదిరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటే ఇలా చేయాలి
RELATED ARTICLES