గణేష్ ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని:డిఎస్పి శ్రీధర్ రెడ్డి
:గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ రాజేందర్
:లడ్డు వేలం పాటను 108116/- కు కైవసం చేసుకున్న కొండవీటి సుబ్బారావు
:డ్రాలో స్కూటీని గెలుపొందిన రామచంద్రుని వెంకటేశ్వర్లు
Mbmtelugunews //కోదాడ, సెప్టెంబర్ 05 (ప్రతినిధి మాతంగి సురేష్): గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని డిఎస్పి శ్రీధర్ రెడ్డి అన్నారు. స్థానిక శ్రీ నగర్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద డాక్టర్ రాజేందర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన లడ్డు పాటను 108116/- కొండవీటి సుబ్బారావు కైవసం చేసుకున్నారు. ఐదు రూపాయల కాయిన్స్ తో తయారుచేసిన భారీ గజమాలను 41516/- రూపాయలకు కాటా కిరణ్ వేలంపాట పాడినారు. కమిటీ వారు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రాలో కాయిన్ నెంబర్ 61 రామచంద్రుని వెంకటేశ్వర్లు టీవీఎస్ జూపిటర్ స్కూటీని గెలుచుకున్నారు. కాయిన్ నెంబర్ 168 ఎం రామారావు 10 గ్రాముల వెండిని గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్దలతో గణేష్ మండపాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ఈ నవరాత్రులు మహిళలు కమిటీ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాధుని పూజించారని అన్నారు.అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బత్తినేని హనుమంతరావు భూసాని మల్లారెడ్డి కొత్త రఘుపతి హరి ప్రసాద్ భూపతి రెడ్డి శ్రీనివాసరెడ్డి సత్యనారాయణ రెడ్డి వీరారెడ్డి లక్ష్మయ్య కొండలరావు తదితరులు పాల్గొన్నారు.



