గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: కామిశెట్టి వెంకటేశ్వర్లు
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 04(ప్రతినిధి మాతంగి సురేష్): గణేష్ నవరాత్రి ఉత్సవాలు గణేష్ యూత్ కమిటీ సభ్యులు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అడ్వకేటు కామిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండల పరిధిలోని గణపవరం గ్రామంలో పొట్టి శ్రీరాములు సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన లడ్డు పాటను కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని గణేష్ ఉత్సవ కమిటీని అభినందించారు. లడ్డు పాటను దక్కించుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గణేష్ నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా అందరూ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



