గణేష్ నవరాత్రుల పూజలు
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 28(ప్రతినిది మాతంగి సురేష్): స్థానిక గోపిరెడ్డి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ . విగ్నేశ్వరుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు రెడ్డిమల్ల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు రావెళ్ల కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి బాడిషా రామారావు, కమిటీ సభ్యులు అంబురి వెంకటరెడ్డి, వాచేపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం వెంకట్ రెడ్డి, గాయం బ్రహ్మానంద రెడ్డి, పింగళి వెంకటేశ్వర్ రెడ్డి, యర్ర సాని వెంకటరెడ్డి, పరిపూర్ణ చారి తదితరులు భక్తులు పెద్దలు పాల్గొన్నారు.



