గణేష్ మండపాల వద్ద కుంకుమ పూజలలో పోటెత్తిన మహిళలు
Mbmteluhunews//కోదాడ, ఆగస్టు 29(ప్రతినిది మాతంగి సురేష్): మూడవరోజు పట్టణం లోని గోపిరెడ్డి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో
మండపం వద్ద మహిళలకు కుంకుమ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజా కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారు ఆశీస్సులు తీసుకోవాలన్నారు. పూజలో పాల్గొన్న మహిళా భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. గణేష్ మండపం వద్ద రావెళ్ల కృష్ణారావు మాలతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు రెడ్డిమల్ల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు రావెళ్ల కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి బాడిషా రామారావు, కమిటీ సభ్యులు ఎర్రసాని మహేష్ రెడ్డి, పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి, అంబురి వెంకటరెడ్డి, వాచేపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం వెంకట్ రెడ్డి, గాయం బ్రహ్మానంద రెడ్డి, పింగళి వెంకటేశ్వర్ రెడ్డి, యర్రసాని వెంకటరెడ్డి, పరిపూర్ణ చారి తదితరులు భక్తులు పెద్దలు పాల్గొన్నారు.



