కోదాడ,డిసెంబర్ 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గత 10 ఏళ్లుగా అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని భారస రాష్ట్ర నాయకులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు.సోమవారం వారి మనవడు సంతోష్ సాత్విక్, సింధుల పుత్రుడు నాగ ఉమా యశ్వన్ జన్మదినం సందర్భంగా వారి సతీమణి రాయపూడి స్వరాజ్యలక్ష్మితో కలిసి కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో గాలి రమేష్ నాయుడు బ్రదర్స్ స్థలంలో గల సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాలి శ్రీనివాస్ నాయుడు నిత్యం 500 మంది స్వాములకు గత పది సంవత్సరాలుగా అన్నదానం చేయడం అభినందనీయం అన్నారు.వారికి అయ్యప్ప స్వామి కరుణా,కటాక్షాలుఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఓరుగంటి కిట్టు,కంచుకొమ్ముల.శంకర్,సీతారాం సింగ్,రంగారావు తదితరులు పాల్గొన్నారు………
గత 10 ఏళ్లుగా స్వాములకు అన్నదానం అభినందనీయం :భారస రాష్ట్ర నాయకులు రాయపూడి. వెంకటనారాయణ.
RELATED ARTICLES



