కోదాడ,సెప్టెంబర్ 26(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:గద్దరన్న యాదిలో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా అమరవీరుల స్ఫూర్తి ర్యాలీ తెలంగాణా అమరుడు శ్రీకాంత్ చారి విగ్రహం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించినట్లు ఓయూ జేఏసీ అధ్యక్షుడు డా,, కందుల మధు మరియు టీఎస్ యు ప్రెసిడెంట్ ఎన్ ఎం శ్రీకాంత్ యాదవ్ లు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 1న కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగు గద్దర్ అన్న యాదిలో సభను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.గద్దరన్న స్మృతిలో అమరవీరులను స్మరిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీ శ్రీకాంతా చారి విగ్రహం నుండి మొదలై చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర నినాదాలు ఇస్తూ పూల మాల వేసి చాకలి ఐలమ్మ కు ఘనమైన నివాళి ఘటించడం జరిగింది
ఆతరువాత ఖమ్మం క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ కొనసాగింది ర్యాలీ ముగింపు కు ముందు తెలంగాణ తల్లికి పూల మాల వేసి నివాళి ఘటించడం జరిగింది అమరుల స్ఫూర్తి తో గద్దరన్న యాదిలో జరుగు సభను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.ఇట్టి ర్యాలీ లో 6 మండలాల కో-ఆర్డినేటర్లు పోలంపల్లి బాబు,రేపాకుల నరేష్,మోసిన్ బేగ్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
గద్దర్ అన్న యాదిలో సభను విజయవంతం చేయాలి:డాక్టర్ కందుల మధు,ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్
RELATED ARTICLES



