గర్భంలో దూడ మృతి, ప్రాణాపాయం లో గేదె – ఆవేదనతో రైతు సిజేరియన్ తో గేదెకు పునఃప్రాణం
ఏరియా పశువైద్యశాల కోదాడ లో సిజేరియన్ ఆపరేషన్ తో గేదె కి పునఃప్రాణం
Mbmtelugunews//కోదాడ,జూన్ 20 (ప్రతినిధి మాతంగి సురేష్):మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన రైతు బొమ్మ హన్మంతరావు కి చెందిన ఏడు నెలల సూడి గేదె మేత మేయకుండా పొట్ట ఉబ్బరంగా ఉండడంతో వైద్యం నిమిత్తం కోదాడ పట్టణం లోని ఏరియా పశు వైద్యశాలకు తీసుకుని వచ్చారు. గేదెను పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య అనంతరం పరీక్షలు నిర్వహించి అరల పొట్టలో కదలికలు లేవని,

గర్భాశయం చిట్లినట్టుందని దూడ కూడా ప్రాణాలతో ఉండే అవకాశం లేదని దూడ బైటకు వస్తేనే గేదె కు మంచిదని లేకపోతే తల్లి ప్రాణానికి ప్రమాదమని చెప్పడం తో దూడను బైటకు తీయడానికి ప్రయత్నం చేయగా గర్భాశయ ద్వారం తెరచుకోకపోవడం తో సిజేరియన్ ఆపరేషన్ ద్వారా చనిపోయిన దూడతో పాటు కుళ్లిపోయిన ఎడమవైపు గర్భాశయ శాఖను సైతం తొలగించి గేదె ప్రాణాల్ని కాపాడారు.ఆపరేషన్ తరువాత మత్తు వీడాక గేదె తనంతట తాను లేచి వైద్యశాలలో తిరుగుతూ ఆరోగ్యంగా ఉండడంతో రైతు ఆపరేషన్ విజయవంతం పై ఆనందం వెలిబుచ్చారు.ఈ ఆపరేషన్ లో కాపుగల్లు పశువైద్య శస్త్రచికిత్స కులు డా సురేందర్, సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.