గాలికుంటు టీకా ను ప్రారంభించిన సర్పంచి పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, మార్చి 25(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో గాలికుంట వ్యాధి టీకాను ప్రారంభించిన సర్పంచి పాలకి సురేష్. అనంతరం ఆయన మాట్లాడుతూ గాలికుంటు టీకా పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించుకుంటూ గ్రామంలో ఉన్న ప్రతి పశువుకు టీకా వేయించాలని అన్నారు. గ్రామంలో పశువుల్లో గాలికుంటు వ్యాధి మహమ్మారిని సమూలంగా అంతరింపజేయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహిస్తున్న గాలికుంటు టీకా కార్యక్రమం గ్రామంలో పశుపోషకులకి, ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వెంకటేశ్వరరావు, వార్డు మెంబర్ అమీనా ఖయ్యుం గోపాలమిత్ర ఆదినారాయణ, శ్రీను, ప్రసాద్, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొనడం జరిగింది.



