గిరిజన జాతి సంక్షేమమే సేవాలాల్ సేన లక్ష్యం….
:సేవాలాల్ సేన రాష్ట్ర కన్వీనర్ సైదా నాయక్.
:మూడో సారి ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడిగా ధరావత్ రవీందర్ నాయక్ ఎన్నిక
:సంస్కృతీ సాంప్రదాయాలు కాపాడటమే సేవాలాల్ సేన అంతిమ లక్ష్యం :రాష్ట్ర కో కన్వీనర్ హుస్సేన్ నాయక్
కోదాడ,జూన్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గిరిజన జాతి సంక్షేమం,సాంప్రదాయాలను కాపాడటమే సేవాలాల్ సేన అంతిమ లక్ష్యమని రాష్ట్ర కన్వీనర్, కో కన్వీనర్ లు మాలోతు సైదా నాయక్,బానోతు హుస్సేన్ నాయక్,రాజేష్ నాయక్ అన్నారు.ఆదివారం నియోజక వర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా సదస్సు,నూతన జిల్లా కమిటీ ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వారు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క గిరిజన బిడ్డ సేవాలాల్ మహారాజ్ ఆశయసాధన కోసం పని చేయాలన్నారు.మన తండాలో మన రాజ్యం రావాలంటే సద్గురు సేవాలాల్ మహారాజ్ బాటలో పయనించాలన్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి హక్కులు గిరిజనులకే దక్కేలా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాన్నారు.

గిరిజన అమరుల స్ఫూర్తితో గిరిజన ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.అనంతరం జిల్లా కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షుడిగా ధరావత్ రవీందర్ నాయక్ (మూడోసారి),జిల్లా ప్రధాన కార్యదర్శిగా భూక్యా నాగు నాయక్,ఉపాధ్యక్షులుగా భూక్యా శోభన్,అధికార ప్రతినిధిగా గుగులోతు చందునాయక్,కార్యదర్శిగా రవీందర్ లునావత్,సహాయ కార్యదర్శిగా సక్రం లు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో రాజేష్ నాయక్,పద్మబాయ్,బాలాజీ నాయక్,బలరాం నాయక్ ,శ్రీనివాస్ నాయక్,బాలాజీ నాయక్,నాగు నాయక్, రవి నాయక్,జాను నాయక్,రమేష్ నాయక్,వస్రం నాయక్,శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.