గుడిబండ కాలువలో పడి వ్యక్తి మృతి
:ఒకరికి తీవ్ర గాయాలు
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 04: ముత్యాల బ్రాంచ్ కెనాల్ సబ్ కెనాల్ అయినా గుడిబండ కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే బాలాజీ నగర్ కు చెందిన శ్రీరాములు తిరపయ్య వయస్సు 25 సంవత్సరాలు, ఆవుల వీరబాబు ఇద్దరూ కలిసి గోర్లు మేపటానికి గుడిబండ కాలువ వైపు వెళ్లారు కాలువ డ్రాపుల వద్ద గోర్లు నీళ్లలో పడగా అది గమనించిన తిరపయ్య వీరబాబులు గొర్రెలను కాపాడదామని నీళ్లలోకి దిగగా ప్రమాదవశాస్తూ నీళ్లలో పడి శ్రీరాములు తిరపయ్య అక్కడికక్కడే మృతి చెందాడు వీరబాబు నీళ్లలో కొట్టుకుంటుంటే గమనించిన కొందరు బయటికి తీసి మెరుగైన వైద్యం కోసం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రెస్క్యూ టీం వారు సంఘటన స్థలానికి చేరుకొని తిరపయ్య మృతదేహాన్ని బయటికి తీశారు.



