గుడ్లు దొంగతనం చేసిన హెడ్మాస్టర్!
కామారెడ్డి,జులై 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇవ్వాల్సిన గుడ్లు హెడ్మాస్టర్ లంచ్ బ్యాగులో దర్శనమిచ్చాయి.కామారెడ్డి జిల్లా రామారెడ్డి మం. పోసానిపేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది.స్కూల్లో 55 మంది పిల్లలకు 55 గుడ్లు పంపగా 49 మాత్రమే ఉండటంతో తల్లిదండ్రులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.హెచ్ఎం జోష్ణ దేవి గుడ్లను ఇంటికి తీసుకెళ్తున్నారని డీఈవోకు ఫిర్యాదు చేశారు.దీనిపై విచారణ చేస్తామని డీఈవో తెలిపారు…