గురవయ్య మరణం పార్టీకి తీరని లోటు:బిఆర్ఎస్ నాయకులు బెజవాడ శ్రావణ్
Mbmtelugunews//కోదాడ/నడిగూడెం,అక్టోబర్ 25(ప్రతినిధి నూకపంగు ఈదయ్య)బండారు గురవయ్య మరణం బిఆర్ఎస్ పార్టీ కి తీరని లోటు అని కోదాడ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు బెజవాడ శ్రావణ్ అన్నారు.నడిగూడెం మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బండారు గురవయ్య ఇటీవల కాలంలో మరణించడం జరిగింది.కోదాడ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు బెజవాడ శ్రావణ్ గురవయ్య కుటుంబాన్ని పరామర్శించి 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురవయ్య పార్టీ కోసం నిరంతరం శ్రమించేవాడని పార్టీ ఓ బలమైన కార్యకర్తను కోల్పోయిందని పార్టీలో చాలా చురుగ్గా పాల్గొనే వాడని వారి సేవలను గుర్తు చేసుకున్నారు.ఆయన కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని వారికి ధైర్యాన్ని చెప్పి వారి పిల్లల చదువుకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ వార్డ్ కౌన్సిలర్ బెజవాడ శిరీష,బత్తుల ఉపేందర్,మాజీ సర్పంచ్ లంజపల్లి నాగేశ్వరావు,వల్లాపురం బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నూకపంగు ఈదయ్య,రెడ్డిమల్ల శ్రీను,సైదులు,శ్రీను,రాజు,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.