గురుకులాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఫ్యాకల్టీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను తొలగించటం అమానుషం:చేడపంగు రవికుమార్ స్వేరో
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 06:ఉపాధ్యాయుల దినోత్సవం రోజునాడు ఎస్సీ గురుకులాల్లోని సిఓఇ లల్లో, స్పోర్ట్స్ స్కూల్స్ లల్ల, సైనిక్ స్కూల్స్ లల్లో,కోడింగ్ స్కూల్ ల్లో తాత్కాలిక పద్దతిలో అవుట్ సోర్సింగ్ అగ్రిమెంట్ మీద విధుల్లో ఉన్న వారు సీనియర్ ఫాకల్టీ, జూనియర్ లెక్చరర్స్,సబ్జెక్ట్ అసిస్టెంట్స్,కేర్ టేకర్స్ ఉద్యోగాలు కోల్పోయిన గెస్ట్ ఫాకల్టీ ట్యూషన్ ఫాకల్టీ 2000పైచిలుకు ఉపాధ్యాయులకు అండగా స్వేరోస్ ఉంటారని సూర్యాపేట జిల్లా స్వేరోస్ మాజీ అధ్యక్షులు చడపంగు రవి కుమార్ స్వేరో అన్నారు.డా,, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నియమించిపోయిన గత 14 సంవత్సరాల నుండి మాకు పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయులు లేకుండా మేము ఎలా చదువుకోవాలని హైదరాబాదులోనే గౌడ్ దొడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఉదయం 10:00 గంటలనుండి రాత్రి 07:00 గంటల వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా చడపంగు రవి కుమార్ స్వేరో మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిది ఖచ్చితంగానే ఎస్సీ గురుకులాలపై వివక్షతనే అని ఎస్సీ గురుకులాల్లోని పిల్లలను మళ్ళీ ఉన్నత చదువులకు దూరం చేయాలనీ కుట్రపూరితంగానే గురుకులలను ముసివేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నది అని మండిపడ్డారు…ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరినైతే తొలగించారో వారిని మళ్లీ తిరిగి అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే నియమించి అదే ఉపాధ్యాయులచే పాఠాలు చెప్పే పాతవారినే కొనసాగించాలని డిమాండ్ చేసారు…లేని పక్షంలో పేరెంట్స్ స్టూడెంట్స్ ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగ ఉపాధ్యాయులు కలిసి ఓ ఉమ్మడి నిర్ణయం చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ కు దిమ్మతిరిగే ఉద్యమం చేపడతాము అని అప్పుడు ప్రజలే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కక్షపూరిత వివక్షతాపూరిత చర్యలకు తగిన బుద్ధి చెప్తారు అని స్టూడెంట్స్ పేరెంట్స్ తరుపున హెచ్చరించారు.ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి తన మూర్ఖత్వం వీడి విద్యార్థులతో,పేరెంట్స్ తో అలాగే ఫాకల్టీ తో మర్యాద ప్రేమతో మసులుకోవాలే గానీ ఓ మోనోపోలిగా వ్యవహరించి దుష్ప్రవర్తనతో ప్రజలకోపానికి గురై ఆగం కావొద్దు అని హెచ్చరించారుప్రజలు సమయం వచ్చినప్పుడు నియంతృత్వవైఖరి వహించిన వ్యక్తులకు కర్రుకాల్చి వాతపెడతారు అని హెచ్చరించారు.