గుర్తుతెలియని మృతదేహం లభ్యం……
కోదాడ,జులై 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలోని దుర్గాపురం సమీపంలో గల కేటీఎస్, రేస్ కాలేజ్ మధ్యలో ఖాళీ స్థలంలో విజయవాడ హైవే ను అనుకొని 70 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడి మృతదేహం కలకలం రేపుతుంది. కోదాడ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.చనిపోయిన వ్యక్తి తెల్లటి చొక్కా ధరించి కళ్ళజోడు పెట్టుకొని ఉన్నాడు.

మృతుడికి సంబంధించిన వారు ఉంటే కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు……..
మీ ప్రాంతంలో సమాచారం ఏమైనా ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు