గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
కోదాడ,జూన్ 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్ లో గల ఆదిత్య వైన్స్ వద్ద ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ రోడ్ లో గల ఆదిత్య వైన్స్ వద్ద కొందరు వ్యక్తులు ఘర్షణకు దిగారు.ఈ క్రమంలో గాంధీనగర్ కు చెందిన కలకొండ రామ్ అనే వ్యక్తిపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయాలు చేశారు.క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దాడికి గల కారణాలు తెలియాల్సి వుంది.