గుర్తు తెలియని మగ వ్యక్తి మృతి
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 28:కోదాడ పట్టణం లోని హుజూర్ నగర్ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు వెంట ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం కలదని సమాచారం రాగా అక్కడికి వెళ్ళి చూడగా అతడి వయసు అందాజ 50 సం.ల నుండి 55 సం.లు ఉంటుంది.అతడి శరీరంపై వంకాయ కలర్ మరియు తెలుపు రంగు డబ్బాలు గల ఆప్ షర్ట్,తెల్లని ప్యాంటు దరించి ఉన్నాడు.అతడి శరీరం ఎండిపోయి బక్కగా ఉన్నాడు.అతడి శరీరంపై చొక్కా మరియు ప్యాంటు మాసిపోయి ఉన్నవి గడ్డం,జుట్టు పెరిగి బిచ్చగానివలే ఉన్నాడు.మృతుని ఆనవాళ్లను బట్టి అతనికి సమయానికి ఆహారం నీళ్ళు లేక అనారోగ్యంతో చనిపోయినట్లుగా తెలియుచున్నది.ఇతడి వివరములు తెలియాల్సి ఉన్నది.ఇతడి శవంను గుర్తించుటకు గాను కోదాడ ప్రబుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీ గది నందు భద్రపరచనైనది.ఇట్టి విషయంలో మున్సిపల్ సిబ్బంది మేదర వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏ రంజిత్ రెడ్డి తెలిపారు.