గుర్రం జాషువా 54వ వర్ధంత్రి
హుజూర్ నగర్,జులై 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:హుజూర్ నగర్ పట్టణంలోని జాషువా నగర్ (ఎస్సీ కాలనీ) లో బయ్యారపు రామారావు అధ్యక్షతనే కి॥ శే, గుర్రం జాఘవా 54,వ,వర్ధంతిని ఘణంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ అతిథిగా ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మాతంగి ప్రభాకరరావు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడారు..’జనమంతా ఒక కుటుంబం-జగమంతా ఒక నిలయం అందరం అనుకుంటే కాగలదు మాకు స్వర్గం అని జాషువా కవితలను గుర్తు చేశారు.అనంతరం 11వ వార్డు కౌన్సిలర్ కస్తాల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ జాషువా ప్రముఖ దళిత కవి ,తెలుగు సాహితీ దిగ్గజం అంటరానితనాన్ని ఎదుర్కొన్న కవి అని అన్నారు.బయ్యారపు రామారావు మాట్లాడుతూ జాషువా గబ్బిలం,శిరాదౌసి,క్రీస్త చరిత్ర,కండకావరం,ముంతాజ్ మహల్ అనేక రచనలు చేసిన ప్రముఖ కవి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో చింతిర్యాల నాగయ్య,ఎడవెల్లి వీరబాబు,కస్తాల సైదులు,మేళ్లచెరువు లక్ష్మయ్య,కస్తాల రాఘవులు,మేరిగ వీరబాబు,మేళ్లచెరువు నాగార్జున,ప్రసాదరావు నవీన్,నగేష్,పల్లె క్రాంతి కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Pls subscribe to my channel https://www.youtube.com/live/0_KjbD240G4?si=oNdQ779d_tKUaZ7s