Monday, April 28, 2025
[t4b-ticker]

గులాబీ పండుగకు సర్వం సిద్ధం..

గులాబీ పండుగకు సర్వం సిద్ధం..

:చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభ.

:స్వరాష్ట్రం కోసం పుట్టిన జెండా..

:పోరాడి సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన జెండా..

:తెలంగాణ ఆత్మగౌరవ జెండా మన గులాబీ జెండా

:ఊరు వాడా ఉప్పెనలా కదులుదాం..

:ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం.

:కాంగ్రెస్ పార్టీ ద్రోహాన్ని ప్రజల సమూహంగా నిలదీద్దాం.

:రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.

:చరిత్ర సృష్టించాలన్నా..చరిత్ర తిరగరాయాలన్నా.కేసీఆర్ కే సొంతం

:మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.

Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 26(ప్రతినిది మాతంగి సురేష్):రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది,ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నా నాయకుడు కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్,మాజీ ఎంపీ,జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ లు అన్నారు.శనివారం కోదాడ పట్టణంలోని గడపగడపకు వెళ్లి బొట్టుపెట్టి బిఆర్ఎస్ సభకు హాజరుకావాలని కోరారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…రేవంత్ సర్కార్ లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నమన్నారు.అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడంలో ముందు వరుసలో ఉంటుందని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లుగా భావిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించి,ఆ లక్ష్యాన్ని సాకారం చేసి,నిన్న అధికార పార్టీగా రాష్ర్టాన్ని పదేండ్ల పాటు సుభిక్షంగా,సుఖ,సంతోషాలకు ఆలవోకగా నిలబెట్టి,నేడు ప్రతిపక్ష పార్టీగా 16 నెలలుగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ దుర్మార్గాన్ని అడుగడుగునా చీల్చి చెండాడుతూ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ఆశగా,శ్వాసగా కేసీఆర్‌ నాయకత్వాన రజతోత్సవం జరుపుకొంటున్న వేళ చరిత్రాత్మకమైన భారీ బహిరంగసభకు భారీగా తరలిరావాలని అన్నారు.చరిత్రలో అనేక సందర్భాల్లో తెలంగాణకు ద్రోహం తలపెట్టిన, ప్రభుత్వం ఇప్పటికీ తలపెడుతూనే ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ద్రోహాన్ని ప్రజా సమూహంగా నిలదీద్దాం వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పైడిమర్రి సత్యబాబు,ఏలూరి వెంకటేశ్వరరావు,అరె లింగారెడ్డి,టౌన్ పార్టీ అధ్యక్షులు నయీమ్,కౌన్సిలర్లు అల్వాల వెంకట్,మేదర లలిత,చింతల నాగేశ్వరరావు,యూత్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్,పట్టణ నాయకులు కర్ల సుందర్ బాబు,సుంకర అభి నాయుడు,సంగిశెట్టి గోపాల్,ఉపేందర్ గౌడ్,తాజ్,ఉపేందర్ యాదవ్,తుపాకుల భాస్కర్,బొజ్జ గోపి,కాసాని మల్లయ్య గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular