గొండ్రియాల గ్రామాన్ని చుట్టుముట్టిన పాలేరు వాగు.
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 0:శనివారం రాత్రి కురిసిన కుంభ వర్షానికి పాలేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది.కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలోకి వరద నీరు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి వరద గంటకు పెరుగుతూ గ్రామంలోకి చేరుకుంటుంది.ప్రభుత్వ అధికారులు ఎంపీడీవో,ఆర్డీవో,సిఐ గ్రామంలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.పాలేరు నుంచి ప్రవహించే నీరు గ్రామం చుట్టుముట్టడం జరిగింది.బైకులు, ట్రాక్టర్లు,టక్కులు,స్కూల్ బస్సులు పాలేరు నదిలోకి కొట్టుకుపోయాయి.ముఖ్యంగా హరిజనవాడలోని ప్రజలను ట్రాక్టర్ల మీద ఆటోల మీద సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు.గ్రామంలోని హైస్కూల్లో ప్రహరీ గోడ కూలి స్కూల్ లో నుండీ నీరు ప్రవహిస్తున్న ది.అలాగే పాలేరు వాగు పొంగటం వల్ల నల్లబెల్లగూడెం హైవే మీద నుంచి మూడు అడుగుల్లోతు నీళ్లు ప్రవహిస్తున్నది.విజయవాడ వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా వెనక్కి మళ్లించటం జరుగుతున్నది.గొండ్రియాల గ్రామంలో ఎస్వి స్కూల్ బస్సు పాలేరు లో కొట్టుకొనిపోయింది. సంబంధిత అధికారులు స్పందించి మమ్ములను సురక్షిత ప్రాంతాలకు తరలించి నిత్యవసర సరుకులు అందించాలని గ్రామస్తులు వాపోతున్నారు.