గొండ్రియాల వరద బాధితులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసిన తమ్మర యూత్ సభ్యులు
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 03:అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో సోమవారం రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన తమ్మర యూత్ సభ్యులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పాలేరు వాగుకు వృద్ధుతంగా వరద రావడంతో గొండ్రియాల బ్రిడ్జి పై నుండి నీరు ప్రవహించి గొండ్రియాల గ్రామాన్ని నీరు చుట్టుముట్టడంతో గ్రామ ప్రజలు మధ్యలో ఆగిపోయినారు.ఈ నీరు వాళ్ళ ఇండ్లలోకి రావడం వలన నిత్యవసరలకు సంబంధించిన వన్నీ పూర్తిగా నీట మునిగిపోవడంతో వాళ్లు నానా ఇబ్బందులు పడుతుంటే తమ్మర గ్రామానికి చెందిన యూత్ సభ్యులు సోమవారం రాత్రి వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.మా గ్రామానికి అతి సమీపంలో ఉన్న గొండ్రియాల గ్రామం నీట మునగడంతో మాకెంతో బాధాకరంగా ఉందని వారు అన్నారు.వారికి ఒక పూట అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తమ్మర యూత్ సభ్యులు,గోండ్రాల గ్రామ పెద్దలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.