Thursday, December 25, 2025
[t4b-ticker]

గొండ్రియాల శివాలయం లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు

:నియోజకవర్గ ఈశాన్య మూల నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభం.

:తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శవంతమైన పాలన.

:ఎన్నికల్లో టూరిస్ట్ మాదిరిగా వచ్చే వారిని నమ్మ వద్దు.

:ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని, ఎమ్మెల్యే గా నన్ను ఆశీర్వదించండి,కుటుంబ సభ్యునీలా అండగా ఉండి,సేవ చేస్తా.

:నియోజకవర్గ మే నా కుటుంబం.. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

కోదాడ,అక్టోబర్ 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలోని శివాలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామీ దేవాలయంలో కోదాడ నియోజకవర్గ బిఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ వారి సతీమణి సతీమణి ఇందిరా,కుమారుడు కళ్యాణ్-శ్రీయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి అభిషేకాలు చేసారు.ఈ సందర్భంగా ఆలయ పూజారులు,ఆలయ కమిటీ సభ్యులు మల్లయ్య యాదవ్ దంపతులను వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాలువాలతో సత్కరించారు.దర్శనానంతరం వేదపండితులు మల్లయ్య యాదవ్ దంపతులకు ఆశీర్వచనం‌ అందించారు,ఆలయ కమిటీ వారికీ తీర్థప్రసాదాలను అందజేశారు.గ్రామంలోని తిరుపతమ్మ దేవాలయం,గంగమ్మ తల్లి దేవాలయం,శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామంలో వాడవాడల ప్రగతియాత్రను చేపట్టారు.వీదుల్లో మహిళాలు స్వాగతం పలకగా పలువురు మహిళలు హరతులతో ఆశీర్వదించారు.ప్రగతి యాత్రను ఉద్దేశ్జించి ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ… గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసం కెసిఆర్ ప్రభుత్వం నిరంతరం పాటు పడుతుంది అని అన్నారు.కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదేండ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది అని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పధకాలను కార్యకర్తలు,నాయకులు ఇంటింటికి వివరించాలని చెప్పారు.పేద ప్రజల సంక్షేమం కోసం వివిధ పధకాలను ప్రవేశ పెట్టి అమలు చేసిన ఘనత తమదేనన్నారు,కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందించడం జరుగుతుంది అని అన్నారు.గొండ్రియాల గ్రామంలో వివిధ అభివృద్ధి,సంక్షేమం పధకాల కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది అని తెలిపారు.గ్రామంలో కోట్ల రూపాయలతో చెక్ డాం నిర్మించామని,తమ్మర నుండి గోండ్రియాల రోడ్డు నిర్మించామని తెలిపారు.పశువుల హాస్పిటల్ నిర్మించామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోసపోతామని తెలిపారు.

మన ఓట్లు దండుకొని అందుబాటులో లేకుండా పోయే,ఎన్నికల్లో టూరిస్ట్ మాదిరిగా వచ్చేవారిని నమ్మవద్దు అని తెలిపారు.మీ సమస్య చెప్పుకోవాలంటే ఢిల్లీకో,బెంగళూరుకో వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.మోసపోతే గోసా పడతామని తెలిపారు.ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను, ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆశీర్వదించాలని ప్రజలందరినీ కోరారు.మీ అందరి ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో పోరాటల గులాబీ జెండా ఎగరేస్తామని తెలిపారు.కెసిఆర్ కి కోదాడలో అత్యధిక మెజారిటీతో గెలిపించి కనుక ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు,గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular