గోపమ్మ మరణం బాధాకరం: ఏపూరి తిరుపతమ్మ సుధీర్
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 08:నడిగూడెం మండల కేంద్రానికి చెందిన చలికీటి గోపమ్మ మృతి ఆ కుటుంబానికి బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు.గోపమ్మ కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా వృద్ధురాలి నివాస గృహానికి వెళ్లి పార్థివ దేహం పై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ మృతురాలి కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని తెలిపారు.దగ్గరుండి అంత్యక్రియలలో దంపతులిద్దరూ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కుమారుడు,కోడలు,మనవడు,మనవరాలు,బంధువులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.