గోలి వీరమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
కోదాడ,జులై 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలో 28వ వార్డులో నివాసం ఉంటున్న గోలి వీరమ్మ భర్త కుశలుడు కలసి 40 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివాసం చేస్తున్నారు.వారికి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు అందించబడలేదు గత ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లుకు దరఖాస్తు చేసుకోగా డ్రా సిస్టం ద్వారా రాకపోవడంతో ఎంతో మనస్థాపన చెందారు.అయితే గత రాత్రి వీరమ్మ గుండెపోటుతో మృతిచెందారు.వారికంటూ సొంత గృహం లేకపోవడం వలన ఆ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఓబీసీ,మైనార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరుపతయ్య ద్వారా గుడిబండ లో ఉన్న హోలీ గాస్పల్ ఫైర్ మినిస్ట్రీస్ అనాధాశ్రయం మందిరం వారికి తెలియజేయగా దహన సంస్కార కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది.కావున వారి కుటుంబానికి ప్రభుత్వం,దాతలు తగిన సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ పాస్టర్ సైమన్,తిరుపతన్న,బిక్షం,వీరయ్య,ప్రకాష్,ప్రతాప్,ఇమ్మానియేల్,పృద్వి,కిషోర్,మహేష్,బాలు,పీటర్,రామకృష్ణ,ప్రవీణ్,ఎస్తేరమ్మ,సృజన,ఝాన్సీ,రాణి,గుడిబండ స్థానిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.