గౌరవ డాక్టరేట్ ను అభినందించిన డిఎస్పి శ్రీధర్ రెడ్డి
Mbmtelugunews//కోదాడ,జూన్ 18(ప్రతినిది మాతంగి సురేష్):ఇటీవల కాలంలో డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారి నుండి సామాజిక సేవ విభాగంలో గౌరవ డాక్టరేట్ తీసుకున్న మొలుగూరి నాగరాజుని కోదాడ డిఎస్పి మామిళ్ల శ్రీధర్ రెడ్డి అభినందించి వారి కార్యాలయంలో శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలో మార్పుకు నాంది పలకాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థిని విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని దానికి తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు.