Friday, March 27, 2026
[t4b-ticker]

గ్యాస్ కొరత లేదు…. ప్రజలు ఇబ్బందులు పడ వద్దు…

గ్యాస్ కొరత లేదు…. ప్రజలు ఇబ్బందులు పడ వద్దు…

:కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్యాస్ కొరత రానివ్వదు….

:పెట్రోల్, డీజిల్ కొరత కూడా లేదు….

:వ్యాపారుల పుకార్లు నమ్మ వద్దు….

:కోదాడ లో గ్యాస్ గోడౌన్ సందర్శించిన బీజేపీ సూర్యా పేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్లే బోయిన వెంకటేష్ బాబు.

Mbmtelugunews//కోదాడ, మార్చి 27(ప్రతినిధి మాతంగి సురేష్): నియోజకవర్గంలో ఎటువంటి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇంధనాల కొరత లేదని బీజేపీ సూర్యా పేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేబోయిన వెంకటేష్ బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణం లోని గ్యాస్ గోడౌన్ ను సందర్శించి మాట్లాడారు. గ్యాస్ కొరత లేకుండా కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూస్తుందన్నారు. గ్యాస్ లోడ్ లు వస్తున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు గ్యాస్ లోడ్ వస్తుందన్నారు. బుక్ చేసుకున్న 15 రోజుల కు సిలిండర్ అందుతుందన్నారు. కొందరు బ్లాక్ మార్కెట్ కోసం కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. పెట్రోల్ డీజిల్ కొరత లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రజలు నమ్మ వద్దన్నారు. ప్రజలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరా పై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్రం తో నిత్యం సంప్ర దిస్తుందన్నారు. గ్యాస్ అధిక ధరకు విక్రయించిన , కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయతించిన బీజేపీ పక్షాన అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular