గ్యాస్ ధరలు తగ్గించాలి.. యుద్ధ వాతావరణాన్ని నివారించాలి
సిపిఐ రాష్ట్ర నాయకురాలు ఉస్తేల సృజన డిమాండ్
చింతలపాలెం, మార్చి 16, mbmtelugunews.com//:-
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించాలని సిపిఐ రాష్ట్ర మహిళా సమైక్య అధ్యక్షురాలు ఉస్తేల సృజన డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సృజన మాట్లాడుతూ.. దేశంలో పెరిగిన గ్యాస్, నిత్యావసర ధరలు పేదలపై తీవ్ర భారంగా మారాయని మండిపడ్డారు. మరోవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే యుద్ధ వాతావరణాన్ని తక్షణమే నివారించాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలను వీడకుంటే రానున్న రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చింతిరాల రవి, శాఖ కార్యదర్శి గంధం మంగయ్య, మాజీ సర్పంచ్ గోనె లక్ష్మీ అంకయ్య, అబ్దుల్ బాషా, సత్యనారాయణ, తాళ్లూరు సత్యం, శ్రీనివాస్ రెడ్డి, రామారావు, అంకరాజు నాగేశ్వరావు, వెంకటి, మధు రెడ్డి, వీరయ్య, శీను, బాలు, ఎలమంద మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.



