గ్రాండ్ టెస్ట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం.
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 10(ప్రతినిధి మాతంగి సురేష్)సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ సూచనలతో జనవరి 30వ తారీఖున నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నేడు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం కోదాడ పబ్లిక్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు సోమవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు,మీడియా రంగానికి చెందిన జిల్లా నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. గ్రాండ్ టెస్ట్ లో ప్రతిభ ఘనపరిచిన ముగ్గురు విద్యార్థులతో పాటు మరో 12 మందికి కన్సోలేషన్ బహుమతులను సైతం అందజేస్తున్నామని,ఈ కార్యక్రమానికి విద్యార్థులు,ప్రముఖులు,విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కావాలని కోరారు.