కోదాడ,జులై 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నడిగూడెం మండలం
ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో భాగంగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ మల్లెల వెంకన్న మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి చాకిరి చేయించుకుంటుంది తప్ప వారికి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం లేదని విమర్శించారు.కనీస వేతన చట్టం ప్రకారం గ్రామపంచాయతీ కార్మికులకు నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రతి కార్మికుని కుటుంబానికి ఈ ఎఫ్,పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.మల్టీ పర్పస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో అనునిత్యం వీధులన్నీ శుభ్రం చేస్తూ పలు విధాలుగా చాకిరి చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని కోరారు కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని అన్నారు. ఆదివారం పండగ సెలవును జాతీయ సెలవుగా అమలు చేయాలి కోరారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గ్రామపంచాయతీ కార్మికులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్,గ్రామపంచాయతీ సిబ్బంది చిమట నాగరాజు,కంభంపాటి మధుసూదన్,నంది పాటి,కాసాని తిరపయ్య,గురవయ్య,అనిల్ తదిరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
RELATED ARTICLES