గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం
:దేవుణ్ణి తొలగించడంలో ఉన్న ప్రేమ అధికారులకు గ్రామ అభివృద్ధిలో లేదు
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,నవంబర్ 29(ప్రతినిధి మాతంగి సురేష్)చిలుకూరు మండల పరిధిలోని కటకమ్మగూడెం (రామాపురం) గ్రామంలో పారుశుద్ధ్య పడకేసింది.ఎన్నిసార్లు గ్రామపంచాయతీ కార్యదర్శికి,ఎమ్మార్వో,ఆర్డీవో కు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోని వైనం.రెండు సంవత్సరాల క్రితం రాత్రికి రాత్రి కాలువల నిర్మాణం పేరుతో ఇంటిముందల కాలువలు తొవ్వి వదిలేశారు.

సంవత్సరాలు గడుస్తున్నాయి,ప్రభుత్వాలు మారుతున్నాయి గాని కాలువ నిర్మాణ పనులు మాత్రం జరగకుండా గాలికి వదిలేశారు.ఇళ్లలో నుండి బయటకు పోవాలంటే ఎక్కడ ప్రమాదం ముంచుకొస్తుందని ఆందోళన చెందుతున్న స్థానికులు.నిన్న ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించడంలో అధికారులు చూపించిన చొరవ మా ఇంటి ముందల ఉన్న కాలువలు కట్టడంలో చొరవై ఎందుకు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.