గ్రామాన్ని హరితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
:నర్సరీ పనులను ప్రారంభించిన సర్పంచ్ గువ్వల శిరీష వెంకట్
Mbmtelugunews//కోదాడ, జనవరి 24(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణంలో గల మొక్కల పెంపకం నర్సరీ పనులను శనివారం గ్రామ సర్పంచ్ గువ్వల శిరీష వెంకట్ పాలకవర్గంతో అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శిరీష మాట్లాడుతూ గ్రామంలో మొక్కలు పెంచేందుకు నర్సరీని ఏర్పాటు చేయటం అభినందనీయమని గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయటం వలన గ్రామంలో ఉన్న మహిళలకు ఉపాధి దొరుకుతుందని దీనివలన వారికి జీవనోపాధి లభిస్తుందని తెలిపారు. అధికారులు మొక్కలను ఆరోగ్యంగా పెంచి నర్సరీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆమె కోరారు. అలాగే గ్రామంలో అవసరమైన మొక్కలను స్థానికంగానే పెంచే ఉద్దేశంతో నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల హరితాభివృద్ధికి బలమైన పునాది పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉసిరికాయల శిరీష, వార్డ్ మెంబర్లు, ఏపీవో తానియా, టిఓ, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



