గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
:గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని అడ్లూరు గ్రామం
:కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి
Mbmtelugunews//కోదాడ, మర్చి 03(ప్రతినిధి మాతంగి సురేష్):గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని గత ప్రభుత్వంలో గ్రామాలను, రోడ్లను మరిచారని కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మాటి వరప్రసాద్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో మేళ్లచెరువు రోడ్ నుండి అడ్లూరు వెళ్లే మెయిన్ గ్రామ సర్పంచ్ శిరీష వెంకట్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో తుమాటి వరప్రసాద్ రెడ్డి పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసినారు. అనంతరం గ్రామ సర్పంచ్ శిరీష వెంకట్ మాట్లాడుతూ గ్రామంలోకి వచ్చే రోడ్డు గుంతల పడి వాహనదారులు పాదచర్లు గ్రామ ప్రజలు ప్రయాణించడానికి వీలు లేకుండా ఉన్నందున మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించవలసినదిగా కోరిన వెంటనే ఎమ్మెల్యే స్పందించి సీసీ రోడ్డు శాంక్షన్ చేపించి నిధులు కేటాయించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలోగ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.



