గ్రామ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి.
:పాలకవర్గంతో కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా :పోతురాజు సత్యనారాయణ
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని అల్వాలపురం గ్రామ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని నూతన గ్రామ సర్పంచ్ పోతురాజు సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్ ల ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ అధికారులు పాల్గొని పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన సర్పంచిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి పాలకవర్గంతో కలిసి ప్రజలతో చర్చించి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో సర్పంచిగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ గెలుపుగా భావించి నన్ను గెలిపించారని వారికి రుణపడి ఉంటాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాలపురం గ్రామ ఉపసర్పంచ్ మద్దెల చిన్న మరియమ్మ, వార్డు సభ్యులు ములగిరి శేఖర్, నోసిన వీరస్వామి ,గోసు వసంత ,గోసు వాణి, కంబాల స్రవంతి, శనగల వసంత, ఊదర గోవర్ధన్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



