గ్రామ దేవతల రక్షణలో
కోదాడ సుభిక్షంగా ఉండాలి…
అన్నదానం – మహాదానం..
:కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు…
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 32:అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని చాటిన పెద్దల స్ఫూర్తితో అన్నదానాలు నిర్వహించడం మంచి సాంప్రదాయమని,శుభకార్యాలకు అన్నదానాలు నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కందుల కోటేశ్వరరావు అన్నారు.శనివారం మున్సిపల్ పరిధిలోని శ్రీరంగాపురం లో నాభిశిల ప్రతిష్ట మహోత్సవం జరిగి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా నాభిశిల ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవం మున్సిపల్ కౌన్సిలర్ కందుల చంద్రశేఖర్ తో కలిసి నాభిశిల,గ్రామంలోని దేవతామూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామదేవతల రక్షణలో కోదాడ పట్టణము సుభిక్షంగా ఆరోగ్యప్రదంగా ఉండాలని కోరారు.ప్రస్తుతం అకాల వర్షాల ప్రభావంతో పట్టణ ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని,పండుగలకు,శుభకార్యాల వద్ద ప్రజా సమూహంలో పరిశుభ్రత,డిస్టెన్స్ పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలిపారు.సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ కందుల చంద్రశేఖర్,కందుల వెంకట నరసయ్య,హరికృష్ణ రెడ్డి,చిత్తలూరు శివయ్య,వెంకన్న,రజిని తదితరులు పాల్గొన్నారు…