Thursday, March 26, 2026
[t4b-ticker]

గ్రామ సభల ద్వారా గ్రామ సమస్యలు పరిష్కారం: సర్పంచి గోసుల రాజేష్

గ్రామ సభల ద్వారా గ్రామ సమస్యలు పరిష్కారం: సర్పంచి గోసుల రాజేష్

Mbmtelugunews//నడిగూడెం, మార్చి 25(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని చెన్నకేశవ పురం గ్రామంలో సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో గ్రామసభ బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచి గోసుల రాజేష్ మాట్లాడుతూ గ్రామసభల ద్వారా గ్రామంలో సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కార దిశగా ముందుకు సాగొచ్చు అని అన్నారు. గ్రామ సభలో గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకొని త్వరలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అదేవిధంగా గ్రామంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లో యువకులు పాల్గొని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సర్పంచి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి అధికారులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular