గ్రామ సభ ద్వారా గ్రామ సమస్యల పరిష్కారానికి సులువు: సర్పంచి గోసుల రాజేష్
Mbmtelugunews//నడిగూడెం, ఏప్రిల్ 02( ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక లోభాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభని సర్పంచి గోసుల రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మొదటగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించిన తర్వాత ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించిన గోసుల రాజేష్. అనంతరం ప్రజా పాలనలో గ్రామానికి జరిగిన అభివృద్ధిని వివరించి ఇంకా ప్రజలకు ఉన్న సమస్యల్ని తెలుసుకొని త్వరలోపరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ సభని విజయవంతం చేసిన కేశవాపురం ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి కటికల్లా పుల్లయ్య, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సురేష్, స్పెషల్ ఆఫీసర్, గ్రామస్థాయి అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



