ఘనంగా అంజన్ గౌడ్ జన్మదిన వేడుకలు
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 27: టియుడబ్ల్యూ హెచ్ 143 సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారింగుల అంజన్ గౌడ్ జన్మదిన వేడుకలను మంగళవారం జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా పట్టణంలోని ఖమ్మం ఎక్స్ రోడ్డు నుండి రంగా థియేటర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం అంజన్ గౌడ్ ను శాలువాతో గజమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకున్నారు.తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన జర్నలిస్టులందరికీ అంజన్ గౌడ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.తమ సంస్థ బలోపేతానికి కృషి చేస్తూనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పని చేస్తానని పేర్కోన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పంది తిరుపతయ్య,కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పడిశాల రఘు,నమస్తే తెలంగాణ హరికిషన్,కుడుముల సైదులు,హెచ్ఎంటీవీ పూర్ణ,టీ న్యూస్ లక్ష్మణ్,స్వతంత్ర టీవీ నజీర్,వాసు,సంపత్,గోపాల్ కృష్ణా,ఆదాబ్ లక్ష్మణ్,మల్లయ్య,మతంగి సైదులు,సుధాకర్,వెంకటనారాయణ,దినేష్,శ్రీనివాస్ రెడ్డి,శేఖర్,శ్రీకాంత్,సైదులు,సునీల్,నజీర్,వేణుగోపాల్,బసవయ్య,సైదులు,సతీష్ రెడ్డి,సతీష్,అశోక్ రెడ్డి,శ్రీను,లక్ష్మీనారాయణ,మునగాల రంగా,నాగేందర్,రామకృష్ణ,రాము,మురళి,రవి,నరేష్,సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.