కోదాడ,మార్చి 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉమెన్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు.ఈ సభలో స్త్రీలు అత్యున్నతమైన గృహిణిగా,అధికారులుగా,ఉన్నతమైన స్థానాన్ని పొందారు అని ఆయన కొనియాడారు.స్త్రీలు మదర్ తెరిస్సాని ఆదర్శంగా తీసుకొని గొప్ప ఔన్నత్యం కలిగి పేదల పట్ల సానుభూతి కలిగి సామాజిక సేవ చేయాలని అనారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు ఒంటెపాక జానకి ఏసయ్య,ఇండియన్ బ్యాంక్ మేనేజర్ సుమలత,ఉత్తమ టీచర్ అవార్డు గ్రహీత భాగ్యశ్రీ,సీనియర్ సిటిజన్ మేరమ్మ,సత్యవతి,కోయర్ సభ్యులు తబిత,ద్రాక్షావల్లి,సుధా,సునీత తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అంతర్జాతీయ స్త్రీల మహోత్సవం:పాస్టర్ యేసయ్య
RELATED ARTICLES



