Tuesday, July 8, 2025
[t4b-ticker]

ఘనంగా ఆంజనేయస్వామికి పంచసూక్తాలతో అభిషేకము

కోదాడ,ఆగష్టు 15(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరబండపాలెంలో స్వయంభవుగా వేంచేసియున్న శ్రీదేవల్ బాలాజీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటలకు మొదలై దాదాపు గంటన్నర వరకు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ప్రత్యేక ముగా పంచసూక్తాలతో అభిషేకము ఆచరించి,తరువాత ఆంజనేయ సహస్ర నామావళి,అష్టోత్తరనామావళితో తములపాకులపూజ చేసినాము. ఈ కార్యక్రమాన్ని తిలకించడాని విశేషించి భాగ్యనగరం నుండి కూడ భక్తులు విచ్చేసి,పూజలో పాల్గొన్నారు.

అనంతరం హారతి,తీర్థప్రసాదములు,కళుహోర చిత్రాన్నము వితరణ,ఆపై,శ్రీవేంకటేశ్వరస్వామికి పూజాదికాలు నిర్వహింపబడినవి. అనంతరం ఆలయ అర్చకులు ముడుంబై వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ ఈ దేవాలయానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని నిత్యం పూజలందుకుంటూ వేలాది మంది భక్తులకి కోరిన కోర్కెలు తీరుతుందని అన్నారు. భక్తులు తన జీవితకాలంలో ఒకసారైనా ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారి కోరికలు తీరుతాయని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో సహాయకులు ముడుంబై లక్ష్మణాచార్యులు,భక్తులు ,బారుసతీశ్, రంగారావు ఆలయసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular