కోదాడ,జనవరి 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శి పేదల పెన్నిధి ప్రియాంక గాంధీ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి హాజరై కేకు కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సోనియా గాంధీల కుమార్తె,రాహుల్ గాంధీ సోదరి పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదినోత్సవ వేడుకలను కోదాడ కు చెందిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం పలువురు నిరుపేదలకు పండ్లు పంపీణీ చేశారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES



