ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు
కోదాడ,జులై 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఇండియన్ క్రిస్టియన్ డే ను స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు.ఏసుప్రభు 12 మంది శిష్యులలో ఒకరైన అపోస్తుడైన పరిశుద్ధ తోమా క్రీస్తు శకము 72వ సంవత్సరంలో జూలై మూడున హతసాక్షి అయినారు.వారి జ్ఞాపకార్థము జూలై మూడున భారతీయ క్రైస్తవ దినోత్సవం గా క్రైస్తవులు జరుపుకుంటున్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక బాప్టిస్ట్ చర్చిలో యునైటెడ్ పాస్టర్ అండ్ క్రిస్టియన్స్ అసోసియేషన్ కోదాడ తరపున కేక్ కట్ చేసి భారతీయ క్రిస్టియన్ డేను ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ వి యేసయ్య,కోదాడ మున్సిపాలిటీ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యులు వంటేపాక జానకి ఏసయ్య,సీనియర్ పాస్టర్ రెవ సిహెచ్ లూకా కుమార్,క్రైస్తవ నాయకులు పంది తిరుపతయ్య,పాస్టర్స్ శ్రీనివాస గౌడ్,కర్ల ప్రభుదాస్,డేవిడ్ రాజ్,చిలుకూరు అబ్రహం,పౌలు చారి,వినోద్,విజయానంద్ తదితరులు పాల్గొన్నారు