Sunday, April 5, 2026
[t4b-ticker]

ఘనంగా ఈస్టర్ పండుగ ప్రార్ధనలు

ఘనంగా ఈస్టర్ పండుగ ప్రార్ధనలు

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 05( ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా ఈస్టర్ వేడుకలు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏసుప్రభు వారు మరణించి మూడో దినమున తిరిగి లేచిన దినమును ఈస్టర్ పండగగా క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని, పునరుద్ధానం క్రైస్తవుల గొప్ప విశ్వాసం యేసు ప్రభువు తిరిగి లేవడం ద్వారా క్రైస్తవుల నిరీక్షణ అని ఆయన అన్నారు.ఈ పండుగకు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో గీతాలాపన చేస్తూ దేవుని స్తుతించారు.

చిన్న పిల్లల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్దలు చెప్పిన శుభాకాంక్షలు స్త్రీల ప్రార్థనలు ఈ పండుగకు ఆకర్షణగా నిలిచాయి.ప్రత్యేకంగా ప్రతిరోజు ఏకజామన ప్రార్థించే ప్రార్థన పరులైన వారికి ప్రత్యేక బహుమానాలు అందించారు.
ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ మాజీ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యురాలు జానకి యేసయ్య, నడిగూడెం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, పిఆర్టియు గౌరవ అధ్యక్షులు బొల్లికొండ కోటయ్య, జగ్గు నాయక్, జాన్ మోజెస్, శార, మౌనిక, జ్యోతి, సునిత, రాంబాబు,
రేణుక, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular