ఘనంగా కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు
కోదాడ,మే 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణ పరిధిలోని కొమరబండలో గౌడ కులస్తుల ఆరాధ్యదైవమైన కంఠమహేశ్వరస్వామి సురమాంబదేవి కల్యాణ మహోత్స వేడుకులను ఆ కులస్తులు వైభవంగా నిర్వహించుకుంటున్నారు.మొదటి రోజైన శుక్రవారం దేవాతమూర్తులకు అభిషేకం,జలబిందెలు,పంచామృత స్నానం,నైవేద్యం వంటి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.గ్రామంలో మహిళలు,యువతులు జలబిందెలతో నృత్యాలు చేస్తు ఆలయం వద్దకు వెళ్లారు.ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.శనివారం స్వామి వారి కల్యాణం,ఆదివారం మోకు ముస్తాదులతో పలు పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంపెట రవిగౌడ్,కులపెద్ద సంపెట రామయ్య,సంపెట ఉపేందర్,సంపెట సీతయ్య,వేముల వీరబాబు,ఎర్రగాని చందర్రావు,పంతంగి సత్యం,బండారు విజయ్,అనంతు సత్యం గౌడ కుల కులస్తులు ఉన్నారు.



