కోదాడ,డిసెంబర్ 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన సీనియర్ సిపిఐ నాయకులు కామ్రేడ్ కమతం రాఘవయ్య వర్ధంతి వేడుకలను తమ్మరలో రాఘవయ్య స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి 17 వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావు మాట్లాడుతూ కమతం రాఘవయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించాడని అదేవిధంగా 30 సంవత్సరాలు తమ్మర సర్పంచ్ గా గ్రామంలో ఎన్నో సేవలు అందించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు పోతురాజు సత్యనారాయణ,గొట్టముక్కల కోటి నారాయణ,కమతం పుల్లయ్య,ఏఐటీయూసీ నాయకులు జీవి రాజు,కోటేశ్వరరావు,సుందరయ్య,రాంబాబు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా కమతం రాఘవయ్య వర్ధంతి వేడుకలు
RELATED ARTICLES



