ఘనంగా కార్తిక కాకతీయ కమ్మ సంఘం వనభోజనాలు
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,నవంబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్):మండల కేంద్రం చిలుకూరులో ఆదివారం కాకతీయ కమ్మ సంఘం వనభోజనాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ముందుగా గ్రామంలోని రామాలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పూర్ణకుంభంతో ర్యాలీ నిర్వహించారు.స్థానిక బొడ్రాయి వద్ద జలాభిషేకం నిర్వహించారు.గ్రామ శివారులో గల తోటలో ఊసిరి చెట్టు కింద మహిళలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం జరిగిన సమావేశంలో పలువురిని సత్కరించారు.కార్తిక వన భోజనాల సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకుట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి కమ్మ సంఘం నాయకులు,చిలుకూరు,రామాపురం కమ్మ సంఘం నాయకులు,కుటుంభసభ్యులు తదితరులు పాల్గొన్నారు.