ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు………
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,నవంబర్ 15 (ప్రతినిధి మాతంగి సురేష్)కార్తీక పౌర్ణమి సందర్భంగా చిలుకూరు మండల వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజామునుండే పెద్ద ఎత్తున పాల్గొని శివుడికి అభిషేకాలతో పాటు మహిళలు ఆలయ పరిసరాల్లో దీపారాధనలు చేశారు. ఆలయంలో ఉన్నటువంటి నాగదేవతకు పాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తులతో ఆలయాలు కిటకిటలాడినాయి ఆలయ చైర్మన్లు భక్తులకై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.