Sunday, March 8, 2026
[t4b-ticker]

ఘనంగా కోదాడ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా అంతర్జాతీయమైన దినోత్సవం

ఘనంగా కోదాడ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా అంతర్జాతీయమైన దినోత్సవం

Mbmtelugunews//కోదాడ, మర్చి 08(ప్రతినిధి మాతంగి సురేష్) :స్థానిక నయానగర్ లోని బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. పాస్టర్ ఏసయ్య మాట్లాడుతూ ఈనాడు మహిళలు అనేక రంగాల్లో పురుషులతో సమానంగా ఎదిగి దేశాభివృద్ధిలో తోడ్పడుతున్నారని అన్నారు. ప్రతి రంగంలో మహిళల యొక్క ప్రతిరంగంలో మహిళల ప్రాధాన్యత ఎంతగానో ఉండాలని చదువుల్లోనూ రాజకీయంలోనూ బిజినెస్ లోను మహిళలు ఎంతగానో ముందంజలో ఉన్నారని కొనియాడారు. మహిళలు బైబిల్లోని మహిళలు వారి జీవిత చరిత్రలు అలాగే దేశ చరిత్రలో మహిళల యొక్క ప్రాధాన్యత ను భాగ్యశ్రీ నడిగూడెం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు వివరించారు.
పిఆర్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు బొల్లికొండ కోటయ్య, రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయసంఘం ఉపాధ్యక్షులు బానోతు జగ్గు నాయక్, హెడ్ కానిస్టేబుల్ జాన్ శార, మౌనిక, అరుణా తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు మాజీ కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యురాలు వంటపాక జానకి ఏసయ్య మహిళలందరికీ గులాబీ పుష్పాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత బృందం కవిత, సీత, సునీత, కోటేశ్వరి, కృష్ణవేణి, సుధా తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular