కోదాడ,జులై 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అనంతగిరి మండల కేంద్రంలో ఘనంగా గంగమ్మ జాతర బోనాల పండుగను నిర్వహించారు.ఈ బోనాల జాతరలో కతిమాల తేజశ్రీ బోనం ఎత్తుకొని అనంతగిరి విధులలో నడుచుకుంటూ పలువురిని ఆకట్టుకుంటూ గంగమ్మ దేవాలయం వరకు వెళ్లారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అనంతగిరి మండల కేంద్రంలో గంగమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటున్నామని వారు తెలిపారు.ఈ కార్యక్రమానికి గ్రామంలో ప్రతి ఒక్కరూ బోనం ఎత్తుకొని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో కతిమాల వెంకన్న,రమాదేవి,సునీత,దేవి శ్రీ,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గంగమ్మ జాతర
RELATED ARTICLES